‘వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌.. ఆయనది గొప్ప ఆత్మ విశ్వాసం’

Rajinikanth Into The Wild With Bear Grylls Release Says Age Is a Number - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌ కలిసి చేసిన వెబ్‌ సిరిస్‌ ‘ఇన్‌టూ ద వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌’  ప్రత్యేక ఎపిసోడ్‌ సోమవారం విడుదలైంది. రజనీ డిస్కవరీ ఛానెల్‌ రూపోదించిన ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ విడుదలైనప్పటీ నుంచి సోషల్‌ మీడియాలో ట్రేండ్‌ అవుతోంది. ఇది చూసిన చూసిన ఆయన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

బేర్‌ గ్రిల్స్‌తో సమానంగా ఆయన చేసిన స్టంట్స్‌ చూసి అభిమానులంతా ఇలా తలైవాను ఎప్పుడు చూడలేదంటూ.. ‘వయస్సు కేవలం సంఖ్య మాత్రమే’ ‘ఇది నిజంగా సూపర్‌ స్టార్‌ కోసమే’ ఇప్పడే ప్రిమియర్‌ చూశాను.. వావ్‌ ఎంత గొప్ప ఆత్మ విశ్వాసమో తలైవాది’  ‘అడవుల్లో ఆయన స్టైలిష్‌గా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాక  ‘ రజనీ వయసు కేవలం సంఖ్య మాత్రమే అని బేర్‌ గ్రిల్స్‌ ఇదివరకే చాలసార్లు చెప్పారు. అయితే అది ఇప్పుడు రుజువైంది’  ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిసి అద్భతమైన ప్రదర్శన ఇచ్చారు. అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. (రజనీకాంత్‌ సూపర్‌ హీరో: బేర్‌ గ్రిల్స్‌)

‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’

 ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ జరిగింది. కాగా బేర్‌ గ్రిల్స్‌తో పాటు తలైవా బండిపూర్‌ నేషనల్‌ పార్కు ఆరణ్యాన్ని అన్వేషించారు. ఈ క్రమంలో బేర్‌తో కలిసి రజనీ 50 అడుగుల ఎత్తులో ఉన్న ఇనుప వంతేనను అధిరోహించడమే కాకుండా, అడ్వెంచర్‌ ట్రిప్‌లో భాగంగా నడుము లోతు నీళ్లలో అవలీలగా నడుచుకుంటూ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీ డిస్కవరీ వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌ ఎపిసోడ్‌ను జనవరిలో షూట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆయనకు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన రజనీ చిన్న ముల్లు కారణంగా గీతలు పడ్డాయని స్పష్టం చేశారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి అడ్వెంచర్ షోలో పాల్గొన్న రెండవ భారతీయుడు రజనీకాంత్ కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top