సూపర్‌ స్టార్ చివరి చిత్రం అదేనా..? | rajinikanth to quit acting after kaala | Sakshi
Sakshi News home page

Jan 16 2018 10:09 AM | Updated on Sep 17 2018 4:56 PM

rajinikanth to quit acting after kaala - Sakshi

సౌత్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ తన రాజకీయ రంగ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అభిమానులతో జరిగిన సమావేశాల సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించిన రజనీ, త్వరలోనే పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రజనీ పొలిటికల్‌ ఎంట్రీ తరువాత సినిమాల్లో కొనసాగుతారా.. లేదా అని అభిమానులు కలవరపడుతున్నారు.

ప్రస్తుతం రజనీకాంత్ నటించిన 2.ఓ, కాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ముందుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.ఓ రిలీజ్ కానుంది. ఆ తరువాత మూడున్నళ్ల గ్యాప్ తో కాలా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ రెండు సినిమాల తరువాత రజనీ చేయబోయే సినిమాపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. 

దీంతో రజనీ ఇక సినిమాలకు గుడ్ బై చెపుతారన్న ప్రచారం జరుగుతోంది. కాలా రిలీజ్ తరువాత రజనీ పూర్తిగా రాజకీయ కార్యచరణకే సమయం కేటాయిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే వార్తలపై రజనీ వర్గం మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. రజనీ కూడా తన తదుపరి చిత్రాన్ని దేవుడే నిర్ణయిస్తాడంటూ అభిమానులను సందిగ్ధంలో పడేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement