పెద్దన్నయ్య

రజనీకాంత్ సినిమాలంటే ఆ ఎనర్జీయే వేరు. ఆయన సినిమా ప్రకటించినప్పటి నుంచే హంగామా మొదలవుతుంది. ఇక టైటిల్ ప్రకటన తర్వాత ఆ హంగామా రెండింతలవుతుంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాకు ‘అన్నాత్తే’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోమవారం ప్రకటించారు. ‘అన్నాత్తే’ అంటే పెద్దన్నయ్య అని అర్థం. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీ కుమార్తె పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. నయనతార విలన్‌గా కనిపిస్తారని టాక్. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి