
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమా నేడు (జూన్ 7) విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘2.o’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇక తలైవా ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు.
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీ ఓ సినిమాను చేయబోతున్నాడన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాబీ సింహా, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను నేడు డార్జిలింగ్‌లో ప్రారంభించారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ మూవీలో మేఘా ఆకాష్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు.
Shooting commences for #SuperStarWithSunPictures pic.twitter.com/bhBXyfE7SJ
— Sun Pictures (@sunpictures) June 7, 2018