
షోళింగర్: తాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు వర్షపు నీటిని పొదుపు చేయాలని రజనీ అభిమానులు సోమవారం షోళింగర్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తాగునీటి ఎద్దడి తీవ్రమై ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భజలాలు పెంపొందిచడం, మొక్కలు పెంచడం పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలూరు జిల్లా రజనీ మక్కల్ మండ్రం కన్వినర్ రవి అధ్యక్షత వహించా రు. బస్టాండు, వాలాజా రోడ్డు, అరక్కోణం రోడ్డులో రజనీ అభిమానులు ర్యాలీగా వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు.