తలైవా బర్త్‌డే గిఫ్ట్‌ : పేట్ట టీజర్‌

Rajinikanth Birthday Gift Petta Teaser - Sakshi

2.ఓ లాంటి ఘన విజయం తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేట్ట. యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. త్రిష, సిమ్రాన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించగా అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే ఆడియోను రిలీజ్ చేసిన పేట్ట టీం.. తాజాగా రజనీ పుట్టిన రోజు సందర్భం‍గా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఒకటిన్నర నిడివితో రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో పూర్తిగా రజనీ స్టైల్స్‌ లుక్‌ మాత్రమే రివీల్‌ చేశారు. అనిరుథ్ నేపథ్య సంగీతంలో పాటు కార్తీక్ టేకింగ్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top