Robo 2.O Teaser Release Date Confirmed | 2.O టీజర్‌కు ముహూర్తం ఫిక్స్‌ - Sakshi
Sakshi News home page

Aug 1 2018 10:42 AM | Updated on Aug 1 2018 2:52 PM

Rajinikanth 2-o Teaser Release date Confirmed - Sakshi

సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గతంలో ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కిన రోబో చిత్ర కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇప్పటి వరకు పోస్టర్లు, మేకింగ్ వీడియోలను మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఇంత వరకు టీజర్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ రావటంతో టీజర్‌ ఎప్పుడా అని అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయి విజువల్‌ ట్రీట్‌తో ఆగస్టు 15న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట 2.ఓ టీం. అయితే ఈ విషయం చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement