రజనీ.. సినిమా వాయిదా వేయమన్నాడు | Rajini Kanth request to kabali producer S Thanu | Sakshi
Sakshi News home page

రజనీ.. సినిమా వాయిదా వేయమన్నాడు

Feb 14 2016 11:05 AM | Updated on Sep 3 2017 5:39 PM

రజనీ.. సినిమా వాయిదా వేయమన్నాడు

రజనీ.. సినిమా వాయిదా వేయమన్నాడు

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన సినిమా రిలీజ్ విషయంలో భయపడుతున్నాడట.

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన సినిమా రిలీజ్ విషయంలో భయపడుతున్నాడట. అందుకే తన లేటెస్ట్ ఎంటర్టైనర్ కబాలిని వాయిదా వేయాలని నిర్మాత ఎస్ థానుకు సూచించాడు. అయితే రజనీకాంత్ తన సినిమాను వాయిదా వేస్తోంది, ఇతర సినిమాలతో పోటి కారణంగా కాదు. త్వరలో తమిళ నాట ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ప్రభావం తన సినిమా మీద పడకుండా ఉండేందుకు రిలీజ్ వాయిదా వేయాలని భావిస్తున్నాడు. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ మాఫియా డాన్గా నటిస్తున్న సినిమా కబాలి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే రజనీ మాత్రం ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమని చెపుతున్నాడు. తమిళనాట  సినీ రంగంపై రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువ. రాజకీయాల కారణంగా పలు సినిమాల రిలీజ్లను అడ్డుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఇబ్బందులేవి కలగకుండా ఉండేందుకు తన సినిమా వాయిదా వేయాలని భావిస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రజనీ కబాలీ వాయిదా వేయటం మాత్రం కన్ఫామ్ అంటున్నారు తమిళ ఇండస్ట్రీ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement