రీసెంట్ టైంలో పాన్ ఇండియా రేంజులో 'కాంతార 1' సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. అయితే ఇలాంటి మూవీస్ హిట్ అయిన ప్రతిసారి మా ముగ్గురు దర్శకుల్నే కొందరు తమిళ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని ప్రముఖ డైరెక్టర్ పా. రంజిత్ అసహనం వ్యక్తం చేశాడు. 'బైసన్' సక్సెస్ మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
ఇంతకీ అసలేమైంది?
''కాంతార' లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు.. కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ ముగ్గురు తమిళ దర్శకుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మేమే తమిళ ఇండస్ట్రీని చెడగొట్టామని విమర్శిస్తుంటారు. గత రెండేళ్లలో కోలీవుడ్‌లో 600కి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి వీళ్లలో ఎంతమంది తమిళ సినిమా స్థాయిని పెంచగలిగారు?' అని పా. రంజిత్ ఫైర్ అయిపోయాడు.
తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో కమర్షియల్, రూటెడ్ సినిమాలు వస్తున్నాయి. వందల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. తమిళంలో మాత్రం ఏ దర్శకులు కూడా ఆ ఫీట్ సాధించలేకపోతున్నారు. దీంతో రీసెంట్ టైంలో కొందరు తమిళ నెటిజన్లు, రివ్యూయర్స్.. డైరెక్టర్స్ పా. రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్‌పై పడ్డారు. కులం, అణిచివేత సబ్జెక్ట్స్‌తో మాత్రమే వీళ్లు సినిమాలు తీస్తున్నారని, అందువల్లే తమిళ ఇండస్ట్రీ నాశనమైపోతుందని విమర్శించారు. ఆ కామెంట్స్‌కి హర్ట్ అయిన పా.రంజిత్.. ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.
ఇదే ఈవెంట్‌లో పా.రంజిత్ మాట్లాడుతూ.. 'సోషల్ మెసేజ్ ఉండే సినిమాలని అర్థం చేసుకోకుండా వాటిపై కులం అనే ముద్ర వేయొద్దు. ప్రేక్షకులు ప్రేమతో సినిమాల్ని చూస్తారు. కానీ ట్రోల్స్.. ఓ మూవీని చూడకముందే చాలామందికి ఓ అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.
పా.రంజిత్ విషయానికొస్తే.. రజినీకాంత్‌తో కబాలి, కాలా లాంటి మూవీస్ తీశాడు. తమిళంలో వీటికి ఓ మాదిరి ఆదరణ వచ్చింది. తెలుగులో మాత్రం రెండు ఫ్లాప్ అయ్యాయి. గతేడాది 'తంగలాన్' అనే మూవీతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.
(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?)


