కాలేజ్‌కి వెళ్లాను – రాజేంద్ర ప్రసాద్‌

Rajendra Prasad In The Lead Role Is College Kumar - Sakshi

‘కాలేజ్‌ కుమార్‌’ చిత్రంలో కాలేజ్‌కి వెళ్లేది నేనే. ఇప్పటి వరకూ నా మనసుకు నచ్చిన కథల్లో ఈ కథ కూడా ఒకటి. కథా బలం ఉండి దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్పగలిగితే ప్రేక్షకులకు బాగా చేరవవుతుంది. ఈ కథకు ఆ లక్షణాలు చాలా ఉన్నాయి.. ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. రాహుల్‌ విజయ్, ప్రియ వడ్లమాని జంటగా రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘కాలేజ్‌ కుమార్‌’. కన్నడలో ఘన విజయం సాధించిన ‘కాలేజ్‌ కుమార్‌’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో తెరకెక్కించారు డైరెక్టర్‌ హారి సంతోష్.

లక్ష్మణ్‌ గౌడ సమర్పణలో ఎమ్‌ఆర్‌  పిక్చర్స్‌ పతాకంపై ఎల్‌. పద్మనాభ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని రేఖ విడుదల చేశారు. రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ– ‘‘ప్రతి కొడుక్కి వాళ్ల నాన్నే హీరో. శివకుమార్‌ అనే కొడుక్కి నేల మీద నిలబడి సమాజాన్ని ఎలా చూడాలో శశికుమార్‌ అనే తండ్రి నేర్పిస్తాడు.. ఆ క్రమంలో వారద్దరి మధ్య జరిగే కథే ‘కాలేజ్‌ కుమార్‌’’ అన్నారు. ‘‘మా అబ్బాయి రాహుల్‌తో పాటు ఇందులో పనిచేసిన అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు స్టంట్‌ మాస్టర్‌ విజయ్‌.‘‘ఈ సినిమాని తెలుగులో నిరి్మంచడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఎల్‌. పద్మనాభ. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌ నార్ల, ప్రియ వడ్లమాని, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top