రాజేంద్రుడికి క‌ళానిధి అవార్డు | Rajendra Prasad Conferred Kalanidhi Award | Sakshi
Sakshi News home page

May 29 2018 10:35 AM | Updated on May 29 2018 10:35 AM

Rajendra Prasad Conferred Kalanidhi Award - Sakshi

గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా కళానిధి అవార్డు అందుకుంటున్న రాజేంద్రప్రసాద్‌

మైసూరు ద‌త్త పీఠంలో స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డా.రాజేంద్ర ప్ర‌సాద్‌కు క‌ళానిధి అవార్డుని అందించారు. నాలుగు ద‌శాబ్దాలకు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నందుకు గాను ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించారు.

ఈ సంద‌ర్భంగా గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి మాట్లాడుతూ - ‘నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. హాస్యానికి కిరిటాన్ని పెట్టిన న‌ట‌కిరీటికి ఈ క‌ళానిధి అవార్డు ఇవ్వ‌డం ఆనందంగా ఉంది’ అన్నారు. డా.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ - ‘నాలుగు ద‌శాబ్దాలుగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లతో తెలుగు ప్రేక్షక్ష‌కుల‌ను మెప్పించాను. న‌టుడిగా ఎన్నో అవార్డుల‌ను అందుకున్న‌ప్ప‌టికీ  స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా క‌ళానిధి అవార్డును స్వీక‌రించ‌డం ఆనందంగా ఉంది’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement