కొత్త ప్రయాణం

Rajamouli's Son Karthikeya Engaged To Pooja Prasad - Sakshi

యస్‌.యస్‌. రాజమౌళి తనయుడిగానే కాకుండా ‘బాహుబలి’ సెకండ్‌ యూనిట్‌ దర్శకుడిగా, ‘యుద్ధం శరణం’ సినిమాకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కార్తికేయ. ఇప్పటివరకూ సింగిల్‌గా ఉన్న కార్తికేయ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్‌ కుమార్తె పూజా ప్రసాద్‌తో కార్తికేయ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. భక్తి పాటలు పాడుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పూజా. ఈ ఎంగేజ్‌మెంట్‌ కుటుంబ సభ్యుల మధ్యన జరిగింది. ఈ విషయాన్ని కార్తికేయ తెలియజేస్తూ – ‘‘నా ప్రేయసి పూజాతో జీవితంలో కొత్త ఫేజ్‌లోకి వెళ్లడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. విషెస్‌ ద్వారా ప్రేమను కురిపిస్తున్న అందరికీ ధన్యావాదాలు’’ అని పేర్కొంటూ పై ఫొటోను షేర్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top