రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో న్యూస్..! | Rajamouli next project with Mahesh babu | Sakshi
Sakshi News home page

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో న్యూస్..!

May 13 2017 10:03 AM | Updated on Jul 14 2019 4:05 PM

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో న్యూస్..! - Sakshi

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో న్యూస్..!

బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యంగ్ హీరోలతో

బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యంగ్ హీరోలతో చిన్న ప్రాజెక్ట్ చేస్తారని.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ హీరోగా సినిమా ఉంటుందని.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని.. రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్ట్లో మరో వార్త కూడా చేరిపోయింది.

తాజాగా సమచారం ప్రకారం జక్కన్న తన నెక్ట్స్ సినిమాను మహేష్ హీరోగా రూపొందించాలని భావిస్తున్నాడట. చాలా కాలం క్రితమే మహేష్ బాబు హీరోగా కెయల్ నారాయణ నిర్మాణంలో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న మహేష్, తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

మరి రాజమౌళి.. మహేష్తోనే సినిమా చేయాలని భావిస్తే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది..? కొరటాల ప్రాజెక్ట్ను పక్కన పెట్టి రాజమౌళితో సినిమా చేస్తాడా..? లేక రాజమౌళి కొరటాల సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తాడా..? కొరటాల సినిమా తరువాత వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్లతోనూ మహేష్ బాబుకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్ని పక్కన పెట్టి రాజమౌళి సినిమాను ఓకె చేస్తాడా..? అసలు విషయం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement