మార్చి మూడోవారంలో ‘రాజరథం’

Rajaratham - Sakshi

నిరూప్‌ బండారి, అంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా రాజరథం. తమిళ నటుడు ఆర్య, రవిశంకర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన బస్సు పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో రానా డబ్బింగ్ చెపుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా జనవరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే నిర‍్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాని కారణంగా రిలీజ్ వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ కు కొత్త డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్‌. మార్చి 23న రిలీజ్ చేయనున్నారు. అనూప్‌ బండారీ దర్శకత్వంలో 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్‌ బండారీ, అజనీష్ లోక్‌నాథ్‌లు సంగీతమందిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top