లాస్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్ | Raj Tharuns Reaction On Marriage Rumours | Sakshi
Sakshi News home page

లాస్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

Sep 25 2016 9:53 AM | Updated on Sep 4 2017 2:58 PM

లాస్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

లాస్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

సినీ తారలపై గాసిప్స్ సహజం. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్, యాంకర్ లాస్యను పెళ్లాడినట్టుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం రాజ్ తరుణ్ తనదైన స్టైల్లో...

సినీ తారలపై గాసిప్స్ సహజం. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్, యాంకర్ లాస్యను పెళ్లాడినట్టుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం రాజ్ తరుణ్ తనదైన స్టైల్లో స్పందించాడు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిపై సెటైర్స్ వేశాడు.

మీడియాలో వస్తున్న వార్తలపై తన ఫేస్బుక్ పేజ్లో స్పందించిన రాజ్ తరుణ్, 'కేవలం ఒక్కసారి కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్లో కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు' అంటూ మొదలు పెట్టిన రాజ్ తరుణ్, ఇలా వెటకారంగా మాట్లాడుతున్నందుకు క్షమించాలని కోరాడు.

అయితే ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేసేవారిపై ఇంతకన్నా ఎలా స్పదించాలో తనకు తెలియదన్నాడు. మరో మూడేళ్లలోపు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తను పెళ్లి వార్తను తానే అందరికీ తెలియజేస్తానన్నాడు. రూమార్స్ అయినా.., నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్ అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నవారికి పంచ్ ఇచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement