సంక్రాంతి బరిలో నాగార్జున..! | Raj Tarun Rangula Ratnam in Sankranthi race | Sakshi
Sakshi News home page

Jan 2 2018 4:55 PM | Updated on Jul 15 2019 9:21 PM

Raj Tarun Rangula Ratnam in Sankranthi race - Sakshi

పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జై సింహా’ సినిమాలు బరిలో ఉన్నా.. నాగార్జున పోటికి రెడీ అవుతున్నారు. అయితే నాగార్జున బరిలో దిగుతోంది.. హీరోగా కాదు, నిర్మాతగా సంక్రాంతి రేసుకు సై అంటున్నారు కింగ్. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్ లో తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా మారిన రాజ్ తరుణ్ మరోసారి అదే బ్యానర్ లో రంగుల రాట్నం సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ సరసన చిత్రా శుక్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement