రహస్యంగా... | rahasyam movie trailer release | Sakshi
Sakshi News home page

రహస్యంగా...

Oct 27 2018 2:49 AM | Updated on Oct 27 2018 2:49 AM

rahasyam movie trailer release - Sakshi

శ్రీ రితిక

భీమవరం టాకీస్‌ పతాకంపై నిర్మాతగా వంద చిత్రాలకు చేరువలో ఉన్న తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న హారర్‌ చిత్రం ‘రహస్యం’. సాగర్‌ శైలేష్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రామ్‌గోపాల్‌ వర్మ, పూరి జగన్నాథ్‌  విడుదల చేశారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నూతన దర్శకులకు మార్గదర్శి మా ఆర్జీవీగారు. ఆయన చేతుల మీదుగా ఈ వేడుక జరగటం చాలా ఆనందంగా ఉంది.

ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.‘‘రామ సత్యనారాయణ కొత్త దర్శకులను ఎంకరేజ్‌ చేస్తున్నందుకు అభినందనలు’’అని వర్మ అన్నారు. ‘‘రామ సత్యనారాయణ నాకు 14 ఏళ్లుగా తెలుసు. చిన్న సినిమాలు తీసి, విడుదల చేయటంలో ఆయనకు ఆయనే సాటి’’ అన్నారు పూరి. ‘‘వర్మగారిని కలవటం నా జీవితాశయం. ఈ రోజు అది నెరవేరింది. రామ సత్యనారాయణగారు ప్యాషన్‌ ఉన్న నిర్మాత.  నన్ను నమ్మి ఏ రోజూ ఆయన షూటిం గ్‌కు రాలేదు’’ అని శైలేష్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement