రేస్‌ 3...తాజా పోస్టర్‌ చూస్తే... | Race 3: Salman Khan shares brand new poster | Sakshi
Sakshi News home page

రేస్‌ 3...తాజా పోస్టర్‌ చూస్తే...

May 7 2018 6:49 PM | Updated on May 7 2018 8:18 PM

Race 3: Salman Khan shares brand new poster - Sakshi

ట్విటర్‌ ఫోటో

సాక్షి,ముంబై:  బాలీవుడ్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీపై తాజాగా వెల్లడైన పోస్టర్‌ అభిమానుల్లో హల్‌చల్‌ చేస్తోంది.  తన అప్‌కమింగ్‌ మూవీ ‘రేస్ 3’  ట్విటర్‌లో   హింట్‌లు ఇస్తున్న బాలీవుడ్‌  సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ తాజాగా మరో  ఫోటోను షేర్‌   చేశారు.  ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ పోస్టర్‌ని ట్విటర్‌లో సల్మాన్‌ పోస్ట్‌ చేశారు.   అయితే ఈ సారి మాత్రం హీరో బాబీ డియోల్‌తో జాక్విలైన్ ఉన్న ఓ ఇంట్రెస్టింగ్‌ ఫోటోను పోస్ట్‌ చేయడం విశేషం. ఈ పోస్టర్‌ లుక్‌,  బాబీ, జాక్విలైన్‌ మధ్య  రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్  ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.  ఇటీవల సల్మాన్  ట్వీట్‌ ప్రకారం  సల్మాన్‌తో వెరైటీగా పోజులిచ్చిన జాక్విలైన్, ఇప్పుడు బాబీడియోల్‌తో కనిపించడంతో ఈ సినిమాపై ఇంకా భారీ క్రేజ్‌ నెలకొనడంతోపాటు యూత్‌లో భారీ సస్పెన్స్‌ నెలకొంది.  ఎవరు ఏంటో అనే  సీక్రెట్‌ త్వరలోనే రివీల్‌ అవుతుందంటూ  సల్మాన్‌  ప్రకటించడంతో.. ఇంతకీ ఈ  హీరోయిన్ ఎవరితో రొమాన్స్ చేయబోతోందన్న డౌట్ సినీలవర్స్‌ని వెంటాడుతోంది.

రెమో డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో సల్మాన్, అనిల్‌కపూర్ బాబీడియోల్‌తోపాటు జాక్విలైన్  ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా ‘రేస్’ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టగా, గతంలో సైఫ్ చేసిన రోల్‌లో ఇప్పుడు సల్మాన్  అలరించనున్నారు. జాక్విలైన్‌ మొదటి రెండు  భాగాల్లోనూ నటించారు. ఈద్ సందర్భంగా జూన్ 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement