చిరంజీవి 150వ సినిమా కంటే ముందు... | Puri Jagannath to work with Nithiin before Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవి 150వ సినిమా కంటే ముందు...

May 22 2015 2:36 PM | Updated on Mar 22 2019 1:53 PM

చిరంజీవి 150వ సినిమా కంటే ముందు... - Sakshi

చిరంజీవి 150వ సినిమా కంటే ముందు...

చిరంజీవి 150 సినిమా కంటే ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సినిమా తెరకెక్కించనున్నారు.

చెన్నై:  చిరంజీవి 150 సినిమా కంటే ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సినిమా తెరకెక్కించనున్నారు. నితిన్ హీరోగా ఆయన సినిమా తీయనున్నారు. చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఆయన పుట్టినరోజు ఆగస్టు 22న ప్రారంభించనున్నారు. ఈలోపు నితిన్ తో సినిమా తీయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

స్క్రిప్ట్ ఇప్పటికే ఒకే చేశారని,  జూన్ 9న షూటింగ్ ప్రారంభించే అవకాశముందని తెలిపాయి. 50 రోజుల్లోపు షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  నితిన్ సరసన కొత్త హీరోయిన్ నటించే అవకాశముంది. పూరి జగన్నాథ్ సొంత బేనర్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన 'హార్ట్ ఎటాక్' విజయవంతమైంది.  తాజాగా ఛార్మి ప్రధానపాత్రలో 'జ్యోతిలక్ష్మి' పేరుతో ఆయన సినిమా తెరకెక్కించారు.

 కాగా,  'ఆటోజానీ'లో పలు కీలక సన్నివేశాలు మార్చాలని చిరంజీవి సూచించడంతో పూరి జగన్నాథ్ రీవర్క్ చేస్తున్నారని చిత్రపురి సమాచారం. దాదాపు 20 సీన్లు వరకు మారుస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement