చూడగానే ఇంప్రెస్‌ అయ్యా | Puri Jagannadh Launches Deshamlo Dongalu Paddaru Teaser release | Sakshi
Sakshi News home page

చూడగానే ఇంప్రెస్‌ అయ్యా

Jun 10 2018 6:09 AM | Updated on Jun 10 2018 6:09 AM

Puri Jagannadh Launches Deshamlo Dongalu Paddaru Teaser release - Sakshi

గౌతమ్, పూరి, ఖయ్యూమ్, షానీ

‘‘దేశంలో దొంగలు పడ్డారు’ టైటిల్‌ ఆలోచింపజేసేలా ఉంది. టీజర్‌ నచ్చింది. చూడగానే ఇంప్రెస్‌ అయ్యా. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యి యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్‌ రాజన్‌ జంటగా షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్‌ ముఖ్య తారలుగా గౌతమ్‌ రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో రమా గౌతమ్‌ నిర్మించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’.

ఈ సినిమా టీజర్‌ని పూరి ఆవిష్కరించారు. గౌతమ్‌ రాజ్‌కుమార్‌  మాట్లాడుతూ– ‘‘ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీ. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ అంశాన్ని హైలైట్‌ చేస్తూ తీశాం. ప్రస్తుత సమాజంలో జరుగుతోన్న విషయాలను ప్రస్తావించా. కథలో అన్ని ఎమోషన్స్‌ డిఫరెంట్‌ డైమెన్షన్‌లో కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘క్రైమ్‌ జానర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. త్వరలోనే సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు రమా గౌతమ్‌. చిత్ర సహనిర్మాత సంతోష్‌ డొంకాడ, నటుడు ఖయ్యూమ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement