ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా సత్యారెడ్డి | Producers Sector Chairman satya reddy | Sakshi
Sakshi News home page

ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా సత్యారెడ్డి

Jul 19 2016 11:51 PM | Updated on Sep 4 2017 5:19 AM

ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా సత్యారెడ్డి

ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా సత్యారెడ్డి

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నిర్మాతల సెక్టార్ కార్యవర్గాన్ని అవిశ్వాసంతో తొలగించి,

 తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నిర్మాతల సెక్టార్ కార్యవర్గాన్ని అవిశ్వాసంతో తొలగించి, కొత్త  కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పటి దాకా నిర్మాతల సెక్టార్‌కు చైర్మన్ అయిన ప్రతాని రామకృష్ణగౌడ్ పైన, ఆఫీస్ బేరర్లపైన పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
 
  దీంతో పాత కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీ కోసం హైదరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించారు. బసిరెడ్డి, విజయేందర్‌రెడ్డి ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. తాజా ఎన్నికలతో నిర్మాత పి. సత్యారెడ్డి ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శంకర్ గౌడ్, వల్లూరిపల్లి రమేశ్, సెక్రటరీలుగా పద్మిని, పూసల కిషోర్ ఎన్నికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement