హాలీవుడ్‌లోకి టాలీవుడ్‌ దర్శకుడు.. టైటిల్‌ ఇదే! | Director Satya Reddy Prepares Hollywood Entry with ‘King Buddha’ | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ సినిమాను తెరకెక్కించబోతున్న టాలీవుడ్‌ దర్శక, నిర్మాత!

Sep 20 2025 12:53 PM | Updated on Sep 20 2025 1:07 PM

Tollywood director and producer Satya Reddy entered Hollywood

తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో సుధీర్ఘ అనుభవం ఉన్న  దర్శక, నిర్మాత సత్యారెడ్డి తాజాగా ఓ భారీ బడ్జెట్ చిత్రంతో హాలీవుడ్ లోకి ప్రవేశించేందుకు సంసిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఓ బ్యానర్ ను కూడా  రిజస్టర్ చేశారు. హాలీవుడ్ స్థాయి లో నిర్మించే ఈ సినిమా కి అన్ని భాషల్లో  ‘కింగ్ బుద్ధ ’  అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లు తెలిసింది.దాదాపు పాతికేళ్ల క్రితం ‘సర్దార్ చిన్నపరెడ్డి’ చిత్రంతో సినీ జీవితాన్ని ఆరంభించిన ఆయన  ‘ప్రేమికుల రోజు’, హీరో కునాల్ తో ‘కుర్రకారు’, ‘రంగుల కళ’, ‘శంకర్ దాదా జిందాబాద్’ ఫేమ్  కరిష్మా కోటక్ తో పాటు ;పలువురు ప్రముఖ  హీరో, హీరోయిన్ల తో 55 చిత్రాలకు  దర్శక, నిర్మాత, హీరో గా వ్యవహారించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

ఓ వైపు దర్శక, నిర్మాతగా, నటుడిగా తన అభిరుచిని చాటుకుంటూనే నిర్మాతల మండలిలో కూడా కీలకంగా వ్యవహరిస్తుంటారు.   2016 లో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా కూడా ఎన్నుకోబడ్డారు.

ఇదిలాఉండగా....ఆ మధ్య .వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధ నౌక  గద్దర్ తో  ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే చిత్రం నిర్మించి ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు.. ఈ చిత్ర నిర్మాణంలో  అనేకమంది రష్యా,అమెరికా కి చెందిన హాలీవుడ్ యాక్టర్లతో పనిచేస్తున్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయిలో చేయాలనీ అప్పుడే నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

‘ఉక్కు సత్యాగ్రహం’చిత్రకథలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి టెక్నీకల్ సహాయం చేసిన రష్యన్లను కలిసే ముందు అప్పట్లో గద్దర్ ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చిన ప్రేరణతో బుద్ధిజం పైన హాలీవుడ్‌లో ఓసినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సంధర్భంగా సత్యారెడ్డి స్పందిస్తూ, ఈ తాజా చిత్రం షూటింగ్ లోకేషన్ల కోసం ఇప్పటికే అమెరికా, చైనా, టిబెట్, నేపాల్, థాయ్ లాండ్, ,సింగపూర్, మలేషియా తదితర  దేశాలు పర్యటించామని చెప్పారు. ప్రస్తుతం చిత్ర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని,  త్వరలో అమెరికా లో ప్రముఖుల సమక్షంలో చిత్ర పోస్టర్ లాంచ్ తో పాటు  అన్ని వివరాలు ప్రకటిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement