ఆగస్టులో నిర్మాతల మండలి ఎన్నికలు? | Producers Council election in August Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఆగస్టులో నిర్మాతల మండలి ఎన్నికలు?

Jun 17 2020 8:19 AM | Updated on Jun 17 2020 9:18 AM

Producers Council election in August Tamil Nadu - Sakshi

తమిళ నిర్మాతల మండలి ఎన్నికలను ఆగస్టులో నిర్వహించే అవకాశమున్నట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈ మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన విశాల్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. కొందరు నిర్మాతలు మండలి కార్యాలయంపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మండలి వ్యవహారం కోర్టుకెక్కింది. న్యాయస్థానం తమిళ నిర్మాతల మండలికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా జూన్‌ 30లోపు నిర్మాతల మండలి ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఆదేశించింది. మేలో ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు జరిగాయి. కరోనా వ్యాధి ప్రబలడంతో ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కొందరు నిర్మాతలు కోర్టు ను ఆశ్రయించారు. చదవండి: బాయ్‌కాట్‌ సల్మాన్

కోర్టు నిర్మాతల మండలి ఎన్నికలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహించాల ని ఆదేశించింది. తాజాగా మండలి ఎన్నికలను ఆగస్టులో నిర్వహించడానికి సన్నాహాలు జరు గుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలకు హైకో ర్టు పూర్వ న్యాయమూర్తి జయచంద్రన్‌ను ఎన్నికల అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సారి నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి నిర్మాత మురళి, టి శివ పోటీ పడుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమ జట్లను ప్రకటించారు. వీరితో పాటు తాజాగా నిర్మాత కలైపులి దాను, టీ జీ.త్యాగరాజన్, నటుడు విశాల్‌ కూడా పోటీ చేసే అవాశం ఉందనేది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.  

చదవండి: సుశాంత్‌ మామూ బతికే ఉన్నాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement