141 కోట్లు: ఖరీదైన ఇల్లు కావాలి ప్లీజ్‌!

Priyanka Chopra, Nick Jonas couple looking for lavish new home - Sakshi

కొత్తిల్లు వేటలో ప్రియాంక-నిక్‌ జోనస్‌ దంపతులు

గ్లోబల్‌ కపుల్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ దంపతులు కొత్తిల్లు వేటలో ఉన్నారు. కొత్తిల్లు అంటే ఏదో ఆషామాషీగా ఇల్లు కొనుక్కోవాలని వీరు అనుకోవడం లేదు. ఏకంగా 20 మిలియన్‌ డాలర్లు (రు. 141 కోట్లు) ఖర్చు పెట్టి అత్యంత విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోవాలని వీరు భావిస్తున్నారు. అమెరికాలోని హాలీవుడ్‌ కొలువైన లాస్‌ ఏంజిల్స్‌లో ఓ అందమైన నివాసగృహాన్ని కొనేందుకు వీరు ప్రస్తుతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టీఎంజెడ్‌ వెబ్‌సైట్‌ తెలిపింది.

అమెరికన్‌ సింగర్‌ అయిన నిక్‌ జోనస్‌ పెళ్లికి ముందుకు వరకు లాస్‌ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లోని ఇంటిలో ఉండేవాడు. ఐదు బెడ్‌రూమ్‌లు, నాలుగుకు పైగా బాత్‌రూమ్‌లు, అద్భుతమైన స్విమ్మింగ్‌ పూల్‌, కిటికిలోంచి చూస్తే సుదూరంగా ఆహ్లాదకరమైన కొండలు, ప్రకృతి కనిపించేలా ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిని నిక్‌ ఇటీవల 6.9 మిలియన్‌ డాలర్లకు అమ్మేశాడు. గతంలో ఈ ఇంటిని 6.5 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ప్రియాంక-నిక్‌ దంపతులు ఇంకా ఒక ఇంట్లో స్థిరపడలేదని, కొత్తిల్లు కొని అందులో స్థిరపడాలని వీరు కోరుకుంటున్నారని ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది. నిక్‌ ఆస్తి 25 మిలియన్‌ డాలర్లు కాగా, అంతకంటే ఎక్కువమొత్తంలో 28మిలియన్‌ డాలర్ల ఆస్తిని ప్రియాంక కలిగి ఉన్నారని, ఈ నేపథ్యంలో 20మిలియన్‌ డాలర్లతో ఓ ఇల్లు కొనడం వీరికి పెద్దగా ఇబ్బంది కాబోదని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. గ్లోబల్‌ కపుల్‌గా పేరొందిన ప్రియాంక-నిక్‌ దంపతులకు అంతర్జాతీయంగా విపరీతమైన పాపులారిటీ ఉంది. వీరు నిత్యం పబ్లిక్‌ అపీరియెన్స్‌ ఇస్తూనే.. తమ జీవితంలోని ఆనందకరమైన అనుభూతులను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top