వైట్‌హౌస్ విందుకు... | Priyanka Chopra invited for special dinner at White House | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్ విందుకు...

Apr 5 2016 10:59 PM | Updated on Sep 3 2017 9:16 PM

వైట్‌హౌస్ విందుకు...

వైట్‌హౌస్ విందుకు...

‘క్వాంటికో’ టీవీ సిరీస్‌ను ప్రియాంకా చోప్రా ఏ ముహూర్తాన ఒప్పుకున్నారో గానీ ఆమెకు వస్తున్న ఆఫర్లు,

‘క్వాంటికో’ టీవీ సిరీస్‌ను ప్రియాంకా చోప్రా ఏ ముహూర్తాన ఒప్పుకున్నారో గానీ ఆమెకు వస్తున్న ఆఫర్లు, వరిస్తున్న పాత్రలు ఆమెను ఇంటర్నేషనల్ సెలబ్రిటీని చేసేశాయి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మెరిసి, అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రియాంకను మరో బంపర్ ఆఫర్ వరించింది.  ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’లో నటిస్తున్న ప్రియాంకకు అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ నుంచి పిలుపొచ్చింది.

 వైట్‌హౌస్‌కు సంబంధించిన వార్తలను రాసే పాత్రికేయుల స్కాలర్‌షిప్‌ల కోసం ప్రతి ఏటా అమెరికా అధ్యక్షుడు విందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ విందుకు ప్రముఖ హాలీవుడ్ తారలు బ్రాడ్లీ కూపర్, గ్లాడిస్ నైట్, లూసీ లీ, జేన్ ఫోండా వంటి తారలతో కలిసి ప్రియాంక హాజరు కానున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement