బాండ్ గర్ల్గా బాలీవుడ్ బ్యూటీ | priyanka Chopra As bond girl | Sakshi
Sakshi News home page

బాండ్ గర్ల్గా బాలీవుడ్ బ్యూటీ

May 14 2017 3:36 PM | Updated on Sep 5 2017 11:09 AM

బాండ్ గర్ల్గా బాలీవుడ్ బ్యూటీ

బాండ్ గర్ల్గా బాలీవుడ్ బ్యూటీ

హాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ సీరిస్ జేమ్స్ బాండ్. బాండ్ సినిమా రిలీజ్ అవుతుందట.. అన్ని దేశాల్లో ఆ సందడి కనిపిస్తుంది

హాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ సీరిస్ జేమ్స్ బాండ్. బాండ్ సినిమా రిలీజ్ అవుతుందట.. అన్ని దేశాల్లో ఆ సందడి కనిపిస్తుంది. అందుకే బాండ్ సినిమాలో చిన్న పాత్రలో అయిన కనిపించేందుకు హాలీవుడ్ స్టార్లు సైతం ఆసక్తి కనబరుస్తారు. అలాంటి అరుదైన అవకాశం బాలీవుడ్ బ్యూటీని వరించింది. బాలీవుడ్తో పాటు హాలీవుడ్ ఆఫర్లతోనూ ఫుల్ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా రాబోయే బాండ్ సినిమాలో బాండ్ గర్ల్గా అలరించనుందట.

క్వాంటికో టీవీ సీరిస్తో పాటు, రిలీజ్కు రెడీగా ఉన్న బేవాచ్ సినిమాలతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. త్వరలో బాండ్ గర్ల్గా నటించిన తొలి ఇండియన్గా రికార్డ్ సృష్టించనుంది. బాండ్ గర్ల్స్ అంటే బ్రెయిన్ విత్ బ్యూటీ..  ఈ క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్న ప్రియాంక బాండ్ గర్ల్ పాత్రకు న్యాయం చేస్తుందని భావిస్తున్నారు హాలీవుడ్ నిర్మాతలు. డానియల్ క్రెగ్ బాండ్ పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement