లవ్‌ జర్నీ

Priyanka Chopra and Nick Jonas enjoy cycling on New York streets - Sakshi

‘చేతిలోన చెయ్యేసి చెప్పేయవా....’ అంటూ న్యూయార్క్‌ వీధుల్లో పాడుకుంటున్నారు లవ్‌ బర్డ్స్‌ ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌. బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారీ జోడీ. ఇటీవలే ఇండియాకు వచ్చిన నిక్, ప్రియాంక, పరిణీతీ చోప్రాతో కలసి గోవా వెకేషన్‌ ఎంజాయ్‌ చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత నిక్‌తో కలసి ప్రియాంక న్యూయార్క్‌ రిటర్న్‌ అయ్యారు. ఇప్పుడు అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చేతులు కలుపుకుంటూ న్యూయార్క్‌ స్ట్రీట్స్‌లో షికారు చేస్తున్నారు, సైక్లింగ్‌ చేస్తూ వీధులన్నీ చుట్టేస్తున్నారు. ఇలా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట కలసి ఏడడుగులు ఎప్పుడేస్తారని ఎదురు చూస్తున్నారు ప్రియాంక అభిమానులు.

25 దాటేశారు
కేవలం ఒక్కరోజు గ్యాప్‌లోనే 25 క్రాస్‌ చేశారు దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా. మూడు పదుల వయసు దాటిన వీళ్లు ఇప్పుడు 25 క్రాస్‌ చేయడమేంటంటే అది ఏజ్‌లో కాదండీ.. ఫాలోయింగ్‌లో. ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు భామలు 25 మిలియన్‌ (రెండున్నర కోట్లు) ఫ్యాన్స్‌ను సాధించారు. ఈ ఫీట్‌ను ప్రియాంకా గురువారం చేరుకోగా, ఆ మరుసటి రోజే దీపికా పదుకోన్‌  25 మిలియన్స్‌ను చేరుకోవడం విశేషం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top