కోలీవుడ్‌ ఎంట్రీ ఖరారైనట్టేనా ?

Priya Prakash Varrier Entry In Kollywood? - Sakshi

సాక్షి, చెన్నై: నటి  ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఖరారైనట్లేనా? ఇటీవల నటి ప్రియా వారియర్‌ టాక్‌ ఆఫ్‌ ది సినీ ఇండస్ట్రీగా నిలిచింది. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం ఓరు ఆడార్‌ లవ్‌. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ చిత్ర ట్రైలర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్‌లో ఒక కాలేజీ విద్యార్థులు తమ ప్రేమను చాటుతున్న దృశ్యాలు ఉన్నాయి. అంతేకాక హీరోయిన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కొంటెగా కన్ను గీటుతూ.. లవ్‌ బుల్లెట్‌ను గురి చూసి హీరో గెండెల్లోకి వదలడం వంటి దృశ్యాలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

ఈ భామ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయింది. ఆమెతో బేటికి మీడియా సైతం పోటీ పడింది. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలో కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. తాజాగా కోలీవుడ్‌లో సూర్యకు జంటగా కేవీ. ఆనంద్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనుందనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే దీనిపై డైరెక్టర్‌ స్పందించారు. అది అవాస్తవమని ఆయన తెలిపారు. 

అంతేకాక, హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో రొమాన్స్‌ చేయడానికి ప్రియా రెడీ అయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం దర్శకుడు నలన్‌ కుమారస్వామి ఈ అమ్మడిని కోలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. విజయ్‌సేతుపతి హీరోగా సూదుకవ్వుమ్, కాదలుమ్‌ కడందు పోగుం వంటి విజయం సాధించిన చిత్రాలకు కుమారస్వామి దర్శకత్వం వహించారు.  ప్రస్తుతం మరో చిత్రానికి ఆయన రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top