బాలీవుడ్‌కు సోషల్‌ మీడియా స్టార్‌!

priya parkash  - Sakshi

సాక్షి, ముంబయి : ఆమె ఒక్కసారి కన్నుకొట్టి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ‘ముద్దు’ గన్నుతో కాల్చి హృదయాలను పేల్చేసింది. ఆమె ఎవరు? అని మాత్రం చెప్పనక్కర్లేదు. రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుని సోషల్‌ మీడియా మొత్తం తన చుట్టూ తిరిగేలా చేసుకున్న మళయాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ సినిమా కూడా విడుదల కాకుండానే అటు మళయాళం మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా యువహృదయాలను కొల్లగొట్టిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌ ఇంట అడుగుపెడుతోందట.

పూరీ, ఎన్టీఆర్‌ కాంబీనేషన్‌లో వచ్చి బంపర్‌ హిట్‌గా నిలిచిన టెంపర్‌ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ అవబోతుందన్న విషయం తెలిసిందే. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో, కరణ్‌ జోహార్‌ నిర్మాణ సారథ్యంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ‘సింబా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకు ప్రియాను కూడా తీసుకోవాలని కరణ్‌ జోహర్‌ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఆ సినిమాలో ఆమెకు హీరోయిన్‌ పాత్ర ఇస్తారా?, లేక తెలుగులో మధురిమ చేసిన పాత్ర కోసమా? అనేది వేచి చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top