పశ్చాత్తాపంతో ప్రియా ఆనంద్ | Priya anand waits for chance | Sakshi
Sakshi News home page

పశ్చాత్తాపంతో ప్రియా ఆనంద్

Nov 24 2013 9:52 AM | Updated on Sep 2 2017 12:57 AM

పశ్చాత్తాపంతో ప్రియా ఆనంద్

పశ్చాత్తాపంతో ప్రియా ఆనంద్

విజయం ప్రభావం మనిషిపై చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అరుుతే అంతా ఇంతా కాదు. మొదట్లో ఒక్క చాన్స్ అంటూ చేయని ప్రయత్నం ఉండదు.

విజయం ప్రభావం మనిషిపై చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అరుుతే అంతా ఇంతా కాదు. మొదట్లో ఒక్క చాన్స్ అంటూ చేయని ప్రయత్నం ఉండదు. అదృష్టం బాగుండి అవకాశం వస్తే ఒక్క హిట్ కోసం తహతహలాడుతారు. టైమ్ బాగుండి సక్సెస్ వస్తే అప్పటి వరకు ఉన్న వారి మైండ్‌సెట్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందానా వారి ప్రవర్తన ఉంటుంది. పారితోషికం పెంచుకుంటూ పోతారు. నటి ప్రియా ఆనంద్ ఇందుకు వ్యతిరేకం కాదు.


 
 ఈ బ్యూటీకి ఎదుర్‌నీచ్చల్ చిత్రానికి ముందు ఒక్క విజయం లేదు. కోలీవుడ్‌లోకి 180 చిత్రంతో రంగప్రవేశం చేసిన ప్రియాఆనంద్‌కు ఆ తరువాత సరైన అవకాశాలే లేవు. బాలీవుడ్‌లో శ్రీదేవితో కలిసి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం చేసినా ఆ చిత్రం ఈమె కెరీర్‌కు ఏమాత్రం ప్లస్ కాలేదు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది. అక్కడ కెరీర్ ఆశాజనకంగా లేదు. అయితే తమిళంలో ఎదుర్‌నీచ్చల్ ప్రియా ఆనంద్‌కు విజయం రుచి చూపించింది.


 
 ఒక సక్సెస్ చాలు అన్నట్లుగా ఈమె ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. అప్పటి వరకు నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టని ప్రియాఆనంద్ ఆ తరువాత షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం షూటింగ్‌లకు డుమ్మాకొట్టడం మొదలెట్టింది. చిత్రానికి ఐదు లక్షల చొప్పున పారితోషికం పెంచుకుంటూ పోరుుంది.


 
 ప్రస్తుతం 40 లక్షల పారితోషికం తీసుకుంటున్న ఈ భామ దాన్ని 50 లక్షలకు పెంచాలని ఆశపడుతోంది. వణక్కం చెన్నై చిత్రం తరువాత ప్రియా ఆనంద్ రూ.50 లక్షలు డిమాండ్ చేస్తోందట. దీంతో పెన్సిల్ చిత్ర నిర్మాత వేరే వారిని ఎంపిక చేసుకున్నారు. ఇలా పలు నిర్మాతలు వెనుకంజ వేయడంతో ఇప్పుడు సినిమాల్లేక  ప్రియా ఆనంద్ పశ్చాత్తాపం పడుతున్నట్లు కోలీవుడ్ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement