డిఫరెంట్ టైటిల్‌తో నార్త్‌ స్టార్‌ సినిమా | Premaku Raincheck Title Logo Poster Launch | Sakshi
Sakshi News home page

Jul 14 2018 3:28 PM | Updated on Jul 14 2018 3:28 PM

Premaku Raincheck Title Logo Poster Launch - Sakshi

పవన్‌ కల్యాణ్‌ హీరోగా గోపాల గోపాల, సర్దార్‌ గబ్బర్‌ సింగ్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన శరత్‌ మరార్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రేమకు రెయిన్‌చెక్‌. ‘రెయిన్ చెక్’ అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ట్రెండీ లవ్‌ స్టోరిగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఈ రోజు (శనివారం) విడుదల చేశారు. 

నూతన నటీనటులు అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement