నాలుగు రోజుల్లో రూ.130 కోట్ల వసూళ్లు | 'Prem Ratan Dhan Payo' mints almost Rs.130 crore in opening weekend | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో రూ.130 కోట్ల వసూళ్లు

Nov 16 2015 6:46 PM | Updated on Sep 3 2017 12:34 PM

నాలుగు రోజుల్లో రూ.130 కోట్ల వసూళ్లు

నాలుగు రోజుల్లో రూ.130 కోట్ల వసూళ్లు

క్లాస్ అయినా, మాస్ అయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.

ముంబై: క్లాస్ అయినా, మాస్ అయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అతడు తాజాగా నటించిన ఫ్యామిలీ డ్రామా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' రికార్డ్ ఓపెనింగ్స్ కలెక్షన్ రాబట్టింది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 130 కోట్లు వసూలు చేసింది.

దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో రూ. 129.77 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మొదటి మూడు రోజుల్లో 101.47 కోట్లు రాబట్టింది. ఆదివారం ఒక్క రోజే రూ. 28.30 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ కలెక్షన్లు బాగున్నాయని, తర్వాత వసూళ్లను బట్టి సినిమా ఏ రేంజ్ కు వెళుతుందో తెలుస్తుందని ట్రేడ్ ఎనలిస్టులు అంటున్నారు.

ఈ సినిమాను రూ. 60 కోట్ల బడ్జెట్ లో తీశారు. 16 ఏళ్ల తర్వాత సూరజ్ ఆర్ బరజాత్య దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ బాషల్లో దీన్ని విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement