హైదరాబాద్‌కి వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది

prabhudeva's lakshmi audio, trailer release - Sakshi

ప్రభుదేవా

ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేశ్, బేబి దిత్య ముఖ్య తారలుగా నటించిన డ్యాన్స్‌ బేస్డ్‌ మూవీ ‘లక్ష్మి’. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్‌ ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీఎస్‌ శ్యామ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను దర్శకుడు వీవీ వినాయక్, ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్‌ విడుదల చేశారు. అనంతరం వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘ప్రభు మాస్టర్‌ అంటే మా అందరికీ చాలా గౌరవం.

అన్ని భాషల్లో కీర్తి సంపాదించిన ఆయన ఇప్పటికీ లైమ్‌లైట్‌లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. విజయ్‌ అర్థవంతమైన సినిమాలు తీస్తాడు. నా సినిమా టైటిల్‌ను వాడుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘గొప్ప ప్రొడ్యూసర్‌ కల్యాణ్‌గారు రిలీజ్‌ చేస్తున్న  ఈ సినిమా హిట్‌ సాధించాలి. ఎ.ఎల్‌. విజయ్, నేను ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్‌ చేశాం’’ అన్నారు క్రిష్‌. ‘‘చాలా ఇష్టపడి ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాను. ఇందుకు కారణం ప్రభుదేవాగారే. మంచి ఫీల్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు సి.కల్యాణ్‌. ‘‘ఈ ఆడియో వేడుకను ఇంత బాగా సెలబ్రేట్‌ చేసిన  కల్యాణ్‌గారికి థ్యాంక్స్‌.

హైదరాబాద్‌కి వస్తే నాకు పుట్టింటికి వచ్చిన ఫీలింగ్‌ కలుగుతుంది. విజయ్‌గారికి ఇది బెస్ట్‌ ఫిల్మ్‌ అని చెప్పొచ్చు. ఇది డ్యాన్స్‌ సినిమా అనే కంటే ఎమోషనల్‌ మూవీ అని చెప్పవచ్చు. దిత్య సూపర్‌ డ్యాన్సర్‌’’ అన్నారు ప్రభుదేవా. ‘‘ప్రభుదేవా ఈ సినిమాకు ఒక యాక్టర్‌లా కాకుండా గాడ్‌ఫాదర్‌లా పనిచేశారు. చిన్నారి దిత్య బాగా కష్టపడింది’’ అన్నారు చిత్రదర్శకుడు విజయ్‌. ‘‘నేను ఇంటర్‌ చదువుతున్నప్పుడు ప్రభుదేవాగారి ‘ప్రేమికుడు’ సినిమా చూశా. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌. చిన్న పిల్లల ప్రతిభను బయటకు చూపించే ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది’’ అన్నారు రాజ్‌ కందుకూరి. బేబి దిత్య, ఐశ్వర్యా రాజేశ్, సత్యం రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top