రన్‌ ప్రభాస్‌ రన్‌ | prabhas & sujeeth's film launched | Sakshi
Sakshi News home page

రన్‌ ప్రభాస్‌ రన్‌

Feb 13 2017 11:52 PM | Updated on Sep 5 2017 3:37 AM

రన్‌ ప్రభాస్‌ రన్‌

రన్‌ ప్రభాస్‌ రన్‌

సరిగ్గా నాలుగేళ్లు... ఈ నెల 8వ తేదీకి నాలుగేళ్లు! ప్రేక్షకులు ప్రభాస్‌ ‘మిర్చి’లో ఘాటెంతో చూసి నాలుగేళ్లు గడిచాయి.

సరిగ్గా నాలుగేళ్లు... ఈ నెల 8వ తేదీకి నాలుగేళ్లు! ప్రేక్షకులు ప్రభాస్‌ ‘మిర్చి’లో ఘాటెంతో చూసి నాలుగేళ్లు గడిచాయి. అప్పట్నుంచీ ఈ ఆరడుగుల అందగాడు తన టైమంతా ‘బాహుబలి’కి రాసిచ్చేశాడు. దాంతో ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటించబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా... అని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురుచూపులకు తెరపడింది.

ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్న సినిమా సోమవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ప్రభాస్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత ‘దిల్‌’ రాజు కెమేరా స్విచ్చాన్‌ చేశారు. 150 కోట్లతో ఈ సినిమాను నిర్మించనున్నారట. దీని తర్వాత వేగంగా సినిమాలు చేసే ఆలోచనలో ప్రభాస్‌ ఉన్నారట.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్, నృత్యాలు: రాజు సుందరం, కెమేరా: మది, సంగీతం: శంకర్‌–ఎహసాన్‌–లాయ్‌.

Advertisement
 
Advertisement
Advertisement