సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

Prabhas Sahoo Release Date And First look Poster - Sakshi

యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం సాహో. బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో సాహోను కూడా బహు భాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాం అంటూ ప్రభాస్‌ సోమవారం ఓ వీడియో మేసేజ్‌ రిలీజ్ చేశాడు. 

అప్పటి నుంచి అభిమానులు ప్రభాస్‌ ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఏంటా అని ఆసక్తిగా ఎదురుచూశారు. మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ను రివీల్ చేశాడు. సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ పోస్టర్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది.

రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top