బాలీవుడ్‌కి అతిథిగా! | Prabhas is the star of the international level with Bahubali | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కి అతిథిగా!

Jun 27 2017 11:24 PM | Updated on Sep 5 2017 2:36 PM

బాలీవుడ్‌కి అతిథిగా!

బాలీవుడ్‌కి అతిథిగా!

ప్రభాస్‌ రేంజ్‌ ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టు మారిపోయింది.

ప్రభాస్‌ రేంజ్‌ ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టు మారిపోయింది. ఈ చిత్రంతో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. ఆయనతో సినిమాలు తీసేందుకు టాలీవుడ్‌ దర్శక–నిర్మాతలే కాదు... బాలీవుడ్‌ దర్శక–నిర్మాతలు సైతం ఇప్పుడు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. ప్రభాస్‌తో స్ట్రైట్‌ ఫిల్మ్‌ తీసేందుకు దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌తో పాటు పలువురు చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి కూడా. ఆ వార్తల సంగతెలా ఉన్నా.. ప్రభాస్‌ హిందీ తెరపై ఓ స్ట్రైట్‌ సినిమాలో హీరోగా కనిపించే ముందు గెస్ట్‌ రోల్‌లో అలరించనున్నారని భోగట్టా.

హిందీ చిత్రం ‘ఖామోషీ’లో ప్రభాస్‌ గెస్ట్‌ రోల్‌ చేయను న్నారనే వార్త షికారు చేస్తోంది. ప్రభుదేవా, తమన్నా జంటగా దర్శకుడు చక్రి తోలేటì  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ ‘కొలైయుదిర్‌ కాలమ్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ని సంప్రదించగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘పౌర్ణమి’లో హీరోగానూ, దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యాక్షన్‌ జాక్సన్‌’లోనూ ప్రభాస్‌ ఓ సాంగ్‌లో కనిపించారు. ఇక, తమన్నాతోనూ ప్రభాస్‌ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కోసం గెస్ట్‌ రోల్‌కి ఒప్పుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement