ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ సీజ్‌

Prabhas Guest House Was Seized - Sakshi

హైదరాబాద్‌: సినీహీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవా రం సీజ్‌ చేశారు. ఇటీవల రాయదుర్గం పాయే గా సర్వే నంబర్‌ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్‌లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలి సింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. దీన్ని జీవోనంబర్‌ 59 కింద రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ స్థలమంతా ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో ఈ స్థలంలో నిర్మాణం చేసిన గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top