సాహో జ్ఞాపకాలు

Prabhas Gets Emotional After Saaho - Sakshi

ఒక్కో సినిమాకు ఏడాది వరకూ సమయాన్ని కేటాయిస్తుంటారు స్టార్స్‌. ఆ ప్రయాణంలో ఆ సినిమా స్పెషల్‌గా మారుతుంటుంది. కొందరు ఆ సినిమాలో ఏదో వస్తువును ఆ ప్రయాణానికి గుర్తుగా దాచుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్‌ కూడా సాహో జ్ఞాపకాలను ఓ కారు, బైక్‌లో చూసుకోనున్నారట. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ ఈ సినిమాకు పని చేస్తున్నారు.

ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి చేసే యాక్షన్‌ సన్నివేశాల కోసం ఎన్నో స్పోర్ట్స్‌ బైక్లు, కార్లు ఈ చిత్రానికి ఉపయోగించిన సంగతి తెలిసిందే. చాలా శాతం వరకూ యాక్షన్‌ సన్నివేశాలను డూప్‌ సహాయం లేకుండా ప్రభాసే చేస్తున్నారు.  ఈ సినిమాలో వాడిన ఓ బైకు, కారును ‘సాహో’ గుర్తుగా తన దగ్గర పెట్టుకోనున్నారట ప్రభాస్‌. ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, మందిరా బేడీ, తమిళ నటుడు అరుణ్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ ఎహాసన్‌ లాయ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top