సినీనటుడు పొట్టి సత్యం మృతి | Potti Satyam Passed away at Koyyalagudem | Sakshi
Sakshi News home page

సినీనటుడు పొట్టి సత్యం మృతి

Jan 27 2014 8:25 AM | Updated on Aug 28 2018 4:30 PM

సినీనటుడు పొట్టి సత్యం మృతి - Sakshi

సినీనటుడు పొట్టి సత్యం మృతి

తెలుగు చలనచిత్రాలలో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన పొట్టిసత్యం(85) ఆదివారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో మృతి చెందారు.

కొయ్యలగూడెం: తెలుగు చలనచిత్రాలలో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన పొట్టిసత్యం(85) ఆదివారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక వైఎస్సార్ నగర్‌లోని బంధువులైన శెనగశెట్టి లక్ష్మీనారాయణ, శెనగశెట్టి వెంకటేశ్వరరావు ఇంటివద్ద గడుపుతున్నారు. చెన్నై టినగర్‌లో ఉండే సత్యంకి నా అన్నవారు ఎవరూ లేరు. దీంతో నెల క్రితం ఆయన వరుసకు సోదరులైన తమ ఇంటికి వచ్చినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

గవరవరంలోని తమపొలంలో ఉన్న ఇంటివద్ద ఉంచి చికిత్స చేయిస్తున్నామని, ఆరోగ్యం విషమించి మరణించారని పేర్కొన్నారు.  150కి పైగా తెలుగు, తమిళ చలనచిత్రాలలో నటించారని వివరించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో సత్యంకు ఉన్న పరిచయంతో అసెంబ్లీ రౌడీ, పెద రాయుడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ తదితర చిత్రాలలో హాస్య,కేరెక్టర్ పాత్రల్లో నటించారన్నారు. పొట్టి సత్యం స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement