ఇద్దరూ 420 గాళ్లే

Posani Krishna Murali,Prithvin new movie started  - Sakshi

పోసాని కృష్ణమురళి, ‘థర్టీ ఇయర్స్‌’ పృథ్వీ, అర్జున్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దేశముదుర్స్‌’. ‘ఇద్దరూ 420 గాళ్లే’ అన్నది ఉపశీర్షిక. కన్మణి దర్శకత్వంలో కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. కన్మణి మాట్లాడుతూ –‘‘పోసాని, పృథ్వీగారు ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి వచ్చిన సినిమా ఇది. వాళ్లిద్దరూ తెరపై కాసేపు కనిపిస్తేనే నవ్వుకుంటాం. అలాంటిది సినిమా అంతా నవ్విస్తే ఇంకెన్ని నవ్వులు పువ్వులు పూస్తాయో చెప్పాల్సిన పనిలేదు.

కథకు హారర్‌ టచ్‌ కూడా ఇచ్చాం. అర్జున్‌ మంచి పెర్ఫార్మర్‌’’ అన్నారు. ‘‘కన్మణి మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే రెండో వారంలో లేదా మూడోవారంలో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత కుమార్‌. సంగీత దర్శకుడు యాజమాన్య, మాటల రచయిత భవానీ ప్రసాద్, పాటల రచయిత రాంబాబు, ఛాయాగ్రాహకుడు అడుసుమిల్లి విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పులిగుండ్ల సతీష్‌ కుమార్, వద్దినేని మాల్యాద్రి. 

Advertisement
Advertisement

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top