ఇప్పుడు పూజా వంతు!

Pooja Hegde Own Dubbing for Aravinda Sametha - Sakshi

దాదాపు నాలుగేళ్లు పూర్తి కావొస్తోంది హీరోయిన్‌ పూజా హెగ్డే తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి. ఇప్పుడీ విషయాన్ని ఎందుకు గుర్తుచేస్తున్నాం అంటే ఓ కారణం ఉంది. ఇప్పటివరకు ఆమె పాత్రలకు డబ్బింగ్‌ ఆర్టిస్టులు వాయిస్‌ ఇచ్చారు. ఇప్పుడు ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం పూజా సొంతంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఇటీవల సమంత, కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ ఇలా కొందరు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు తమన్‌ స్వరకర్త. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top