పెద్దవంశీ స్టయిల్లో... | Sakshi
Sakshi News home page

పెద్దవంశీ స్టయిల్లో...

Published Mon, Feb 17 2020 5:48 AM

Pooja Hegde Launched Emaipothane Song From O Pitta Katha - Sakshi

బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘ఏమైపోతానే మనసిక ఆగేలాలేదే...’ పాటను పూజా హెగ్డే విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఈ పాట వెనక ఓ కథ ఉంది.

మొదట విజువల్స్‌ చిత్రీకరించి, ఆ తర్వాత ట్యూన్‌ కంపోజ్‌ చేయడం జరిగింది. గతంలో వంశీగారు ‘లేడీస్‌ టైలర్‌’కి అలా చేశారు. మా ప్రయోగం కూడా ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌. ‘‘ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఉత్కంఠను రేపుతుంది’’ అన్నారు దర్శకుడు చందు. ఈ సినిమాకు సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement