మెరుపు చూపిస్తున్న ‘జిగేల్‌ రాణి’ | Pooja Hegde Busy With Crazy Projects | Sakshi
Sakshi News home page

మెరుపు చూపిస్తున్న ‘జిగేల్‌ రాణి’

Mar 15 2018 11:21 AM | Updated on Mar 15 2018 12:59 PM

pooja hegde - Sakshi

పూజ హెగ్డే (ఫైల్‌)

ముకుంద సినిమాతో తెలుగు తెరపై మెరిసిన పూజ హెగ్డే అందంతోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంది. తరువాత బాలీవుడ్‌పై కన్నేసింది ఈ సుందరి. హృతిక్‌రోషన్‌ సినిమా మొహంజదారో సినిమాలో నటించింది. కానీ అది బెడిసికొట్టింది. సినిమా ఆడకపోవడంతో నిరాశ పడినా...తెలుగులో అల్లుఅర్జున్‌ సరసన డీజే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో అమ్మడు అందాలకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు వరుస కట్టి తెలుగులో సినిమాలు చేస్తోంది.

రాంచరణ్‌ రంగస్థలం సినిమాలో చేస్తున్న జిగేల్‌ రాణి అంటూ సాగే ప్రత్యేకగీతం మాత్రం తనకు ప్రత్యేకమే అంటోంది ఈ చిన్నది. ఆ సాంగ్‌ను తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ తనకు ఎగిరి గంతులేయానిపిస్తుందటా. అంతలా ఆ సాంగ్‌ ఆడియో, విజువలైజేషన్‌ తనను ఆకట్టుకున్నాయని చెపుతోంది. ప్రస్తుతం పూజ  ప్రభాస్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబుల సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు హైదరాబాద్‌ మోస్ట్‌ డిజరైబుల్‌ ఉమెన్‌ లిస్ట్‌లో కాజల్‌, తమన్నా, శృతిహాసన్‌ లాంటి సీనియర్‌లను వెనక్కినెట్టి పూజ అగ్రస్థానంలో నిలబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement