రివాల్వర్ కోసం... | Police Papara ready for release | Sakshi
Sakshi News home page

రివాల్వర్ కోసం...

Feb 5 2014 12:31 AM | Updated on Sep 17 2018 6:18 PM

రివాల్వర్ కోసం... - Sakshi

రివాల్వర్ కోసం...

విశాఖ ఏజన్సీ ప్రాంతంలో అందరికీ ఇష్టుడైన కానిస్టేబుల్ పాపారావు. మంచితనంతో ఎస్.ఐగా ప్రమోషన్ కూడా సాధించాడు. అయితే..

 విశాఖ ఏజన్సీ ప్రాంతంలో అందరికీ ఇష్టుడైన కానిస్టేబుల్ పాపారావు. మంచితనంతో ఎస్.ఐగా ప్రమోషన్ కూడా సాధించాడు. అయితే..  అనుకోకుండా తన సర్వీస్ రివాల్వర్ మిస్ అయ్యింది. తిరిగి దాన్ని దక్కించుకోవడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘పోలీస్ పాపారావు’. శివాజీరాజా హీరో. నిర్దేష్ నెర్స్ దర్శకుడు. సునీత శ్రీనివాసరావు బొమ్మి నిర్మాత.  విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ-‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నమైన సినిమా ఇది. ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుంది. అంతర్లీనంగా సందేశమూ ఉంటుంది. అమాయకత్వం, అంకితభావం, ప్రేమ.. ఇత్యాది అంశాల మేళవింపైన పాత్రను శివాజీరాజా పోషించారు. అరకులోని అందమైన ప్రాంతాల్లో తెరకెక్కించాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తారకరామారావు పడాల, కెమెరా: చంద్రశేఖర్, పాటలు: రాజు తప్పెట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement