పుస్తక రూపంలో శ్రీదేవి జీవితం

Penguin Random House India is all Set to Publish a Book on Sridevi - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని, తన అభిమానులను విడిచి వెళ్లి సంవత్సరం దాటిపోయిన ఆ విషయాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం ఈ లెజెండరీ స్టార్ జయంతి సందర్భంగా మరోసారి ఆమెను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పబ్లిషర్స్‌ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త బోనికపూర్‌ అనుమతితో పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

‘శ్రీదేవి : గర్ల్‌ ఉమెన్‌ సూపర్‌ స్టార్‌’ పేరుతో తయారవుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్‌ రాస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓ అభిమానిగా నేను ఎప్పుడు శ్రీదేవిని ఆరాధించేవాడిని. ఈ రోజు నాకు భారతీచయులకు ఎంతో నచ్చిన ఓ సూపర్‌ స్టార్‌ కథను చెప్పే అవకాశం దక్కింది.

ఎన్నో ఏళ్లోగా శ్రీదేవితో కలిసి పనిచేసిన తారలు కలుసుకోవటం ఆనందంగా ఉంది. అవన్ని కలిపి ఓ చిన్నారి భారత తొలి లేడీ సూపర్‌ స్టార్‌ ప్రయాణంగా పుస్తకరూపంలో తీసుకురావటం ఓ గొప్ప అనుభూతి’ అన్నారు. ఈ పుస్తకాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top