గోపాల గోపాల ఫస్ట్లుక్ విడుదల | pawan kalyan, venkatesh's gopala gopala first look released | Sakshi
Sakshi News home page

గోపాల గోపాల ఫస్ట్లుక్ విడుదల

Nov 28 2014 4:07 PM | Updated on Mar 22 2019 5:33 PM

టాలీవుడ్ అభిమానులు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' చిత్రం తొలి మోషన్ పోస్టర్ విడుదలైంది.

టాలీవుడ్ అభిమానులు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' చిత్రం తొలి మోషన్ పోస్టర్ విడుదలైంది. యూట్యూబ్లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ పోస్టర్ను విడుదల చేసింది. 'ఓ మైగాడ్' హిందీ చిత్రానికి రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దేవుడిపై కోర్టులో కేసు వేసే హీరో పాత్రలో వెంకటేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మోషన్ పోస్టర్లో పవన్ కల్యాణ్ ఉయ్యాలలో పడుకుని, కళ్లు మూసుకుని చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తుండగా, ఆ వెనక నుంచి వెంకటేశ్ వచ్చి, అచ్చం పవన్ ఇచ్చిన పోజులోనే నిలబడి ఉండగా గోపాల గోపాల అనే టైటిల్ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ అంతా సింబాలిక్గా నెమలి ఈకల డిజైన్ ఉంచారు. మొత్తానికి పవన్, వెంకటేశ్ అభిమానుల ఎదురుచూపులు ఇన్నాళ్లకు ఫలించాయి.

Advertisement
 
Advertisement
Advertisement