అసలు నాకే స్పష్టత లేదు: పవన్ కల్యాణ్ | pawan kalyan press meet on sardar gabbar sing audio release | Sakshi
Sakshi News home page

అసలు నాకే స్పష్టత లేదు: పవన్ కల్యాణ్

Mar 19 2016 7:31 PM | Updated on Mar 22 2019 5:33 PM

అసలు నాకే స్పష్టత లేదు: పవన్ కల్యాణ్ - Sakshi

అసలు నాకే స్పష్టత లేదు: పవన్ కల్యాణ్

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా.. సినిమాలో రాజకీయాలో తనకే ఇంకా స్పష్టత లేదన్నారు.  ఇప్పుడు మాత్రం సినిమాలతో అలసిపోయానని, కొంత విరామం కావాలని వెల్లడించారు. సినిమాల్లో నటించకపోతే కథలు రాస్తానన్నారు.

 

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అన్నయ్య చిరంజీవి వీణ స్టెప్ను ట్రై చేసినట్లు తెలిపిన పవన్ కల్యాణ్.. అన్నయ్యతో కలిసి సినిమా చేసే అవకాశాలున్నాయన్నారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్కు కేవలం పాస్లు ఉన్నవారు మాత్రమే రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆడియో రిలీజ్ మెగాస్టార్ చేతుల మీదుగా జరుగుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement