breaking news
sardar gabbar sing
-
హల్చల్ చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్
హైదరాబాద్: పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. తన అభిమానులకు అంకితం అంటూ మొదలయ్యే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని బాబాయ్ అబ్బాయిలు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కలసి స్పెషల్ షో లో సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు ఈ సినిమాలో ఉన్న 'బ్రూస్ లీ బాబాయ్' లా ఉన్నాడు అన్న డైలాగ్ ను ఈ హీరోలిద్దరి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారట. పవర్ స్టార్ ఫైట్ చేస్తుండగా 'బ్రూస్ లీకి బాబాయ్ లా ఉన్నాడన్నా' అనే డైలాగ్ హాట్ టాపిక్ మారింది. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన శుక్రవారం పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ లు ఈ మూవీని ప్రసాద్ కలర్ ల్యాబ్ లో ప్రత్యేకంగా షో వేయించుకుని చూశారు. నిర్మాత శరత్ మరార్ - డైరెక్టర్ బాబీలు కూడా ఈ షో చూశారు. తనను, తన సినిమాని గుర్తు చేస్తూ... పవన్ కల్యాణ్ మూవీలో డైలాగ్ ని చెప్పించడాన్ని.. రామ్ చరణ్ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడని అంటున్నారు. దీంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రామ్ చరణ్ లు కలసి కనిపిస్తే చూడాలని సంబరపడుతున్న అభిమానులు కూడా ఈ డైలాగ్ తో పండగ చేసుకుంటున్నారు. మెగా అభిమానులు ఎంజాయ్ చేసేలా జాగ్రత్త పడ్డ పవన్ కల్యాణ్.. రామ్ చరణ్ బ్రూస్ లీని కూడా ఉపయోగించుకోవడం విశేషమని అభిమానులు తెగ మురిసిపోతున్నారట. -
అసలు నాకే స్పష్టత లేదు: పవన్ కల్యాణ్
హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా.. సినిమాలో రాజకీయాలో తనకే ఇంకా స్పష్టత లేదన్నారు. ఇప్పుడు మాత్రం సినిమాలతో అలసిపోయానని, కొంత విరామం కావాలని వెల్లడించారు. సినిమాల్లో నటించకపోతే కథలు రాస్తానన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అన్నయ్య చిరంజీవి వీణ స్టెప్‌ను ట్రై చేసినట్లు తెలిపిన పవన్ కల్యాణ్.. అన్నయ్యతో కలిసి సినిమా చేసే అవకాశాలున్నాయన్నారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు కేవలం పాస్‌లు ఉన్నవారు మాత్రమే రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆడియో రిలీజ్ మెగాస్టార్ చేతుల మీదుగా జరుగుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు.