పవన్‌ మరో చిత్రం ప్రారంభం..అభిమానులకు పండగే

Pawan kalyan New Movie Shooting Began Directected By Krish - Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కొత్త చిత్రం బుధవారం ప్రారంభమైంది. క్రిష్‌ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి షూటింగ్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత ఏఎమ్‌ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పవన్‌ కెరీర్‌లో ఇది 27వ చిత్రం. ఈ మూవీ మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో పిరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. క్రిష్‌ దర్శకత్వం వహించిన చివరి రెండు సినిమాలు ప్లాప్‌ అవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా షూటింగ్‌ పరిసరాల్లోకి మీడియాను అనుమతించలేదు. (పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌!)

ఇప్పటికే పవన్‌ వేణు శ్రీరామ్‌ దర్వకత్వంలో ‘పింక్‌’ రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్‌ రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే పింక్‌ రీమేక్‌ షూటింగ్‌ తరువాత పవన్‌ ఈ సినిమా చిత్రీకరణలో రెగ్యులర్‌గా పాల్గొంటాడని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టును ఈ రోజే పట్టాలెక్కించారు. దీంతో పవర్‌స్టార్‌ అభిమానులకు డబుల్‌ ధమాకా లభించడంతో పండగ చేసుకుంటున్నారు. (డబుల్‌ ధమాకా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top