రోహిత్ హీరోగా మరో యాక్షన్ మూవీ | paruchuri Murali Multi Starrer with Nara Rohith, Jagapati Babu | Sakshi
Sakshi News home page

రోహిత్ హీరోగా మరో యాక్షన్ మూవీ

Oct 10 2017 2:05 PM | Updated on Oct 10 2017 2:11 PM

Nara Rohith

బాణం సినిమాత సాఫ్ట్ ఇమేజ్ తో హీరోగా పరిచయం అయిన నారా రోహిత్, ప్రయోగాత్మక చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న రోహిత్ ప్రస్తుతం మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాలకృష్ణుడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోగా దర్శనమివ్వనున్నాడు రోహిత్.

ఈ సినిమా తరువాత కూడా మరోసారి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించేందుకు అంగీకరించాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించాడు. సీనియర్ స్టార్ జగపతిబాబుతో కలిసి రోహిత్ నటించనున్న ఈ సినిమా బుధవారం ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement